బిగ్ డిసీషన్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేసీఆర్ సై..!

Tuesday, September 17th, 2019, 09:04:39 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలిచి రెండో సారి అధికారాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత వరుసగా రెండోసారి కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచి, ఆ తరువాత జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కూడా అధిపత్యాన్ని సొంతమ చేసుకుంది.

అయితే పాలనపై, పార్టీనీ మరింత బలోపేతం చేసేందుకై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరింత ప్రయత్నాలు మొదలెట్టారు. అయితే ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ అంటూ అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని అనుకున్నా అది కాస్త జరగకపోగా ఈ సారి కూడా కేంద్రంలో బీజేపీ సొంతంగానే ప్రభుత్వాన్ని నెలకొల్పింది. అయితే ఇక తెలంగాణ రాజకీయాలపైన పూర్తిగ దృష్టి సారించిన కేసీఆర్ ఇప్పుడు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. మరికొద్ది రోజులలో రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో టీఆర్‌ఎస్‌ పార్టీనీ పోటీలో నిలిపేందుకు కేసీఆర్ అంగీకరించారు. గతంలో నాందేడ్‌ జిల్లాలోని 6 నియోజకవర్గాలను తెలంగాణలో కలపాలని నేతలు ఉద్యమించిన అది జరగలేదు. అయితే ఈ సారి నాందేడ్‌ జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నాందేడ్‌లోని రాజకీయ పార్టీల నేతలు కేసీఆర్‌ని కోరగా దానికి కేసీఆర్ కూడా ఒప్పుకోవడం విశేషం.