బిగ్ న్యూస్: కల్నల్ సంతోష్ బాబు కుటుంబీకులను పరామర్శించిన సీఎం కేసీఆర్!

Monday, June 22nd, 2020, 05:54:35 PM IST

దేశ సరిహద్దు ప్రాంతమైన గల్వాన్ ఘటనలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబం ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. సూర్య పేట లోని సంతోష్ బాబు నివాసానికి సీఎం కేసీఆర్ చేరుకొని పుష్ప మాలతో ఘన నివాళి అర్పించారు. అనంతరం వారు తల్లి దండ్రులను, భార్య సంతోశి ను సీఎం కేసీఆర్ పరామర్శించారు. అయితే ప్రస్తుతం వారికి ఆర్దికంగా సహాయం చేసేందుకు సీఎం కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 5 కోట్ల రూపాయల చెక్ ను వారికి అందజేశారు. అంతేకాక భార్య సంతోషి కి గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇప్పిస్తాం అని చెప్పైన సంగతి అందరికి తెలిసిందే. అందుకు సంబంధించిన ఉత్తర్వులను అందజేశారు కేసీఆర్. అంతేకాక హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో కేటాయించిన ఇంటి స్థలానికి సంబందించిన పత్రాలను వారికి సీఎం కేసీఆర్ అందజేశారు.