2023 లో తెరాస ఇక ప్రతిపక్షమే..!

Wednesday, October 9th, 2019, 12:31:30 PM IST

ప్రజారంజక పాలనా చేస్తేనే ప్రభుత్వాల మనుగడ అనేది పదికాలాలు పటు ఉంటుంది. ఆలా కాకుండా ఏకపక్షముగా ఇష్టం వచ్చిన రీతిలో పరిపాలన చేస్తుంటే అధికారం కట్టబెట్టిన ప్రజలే, ఆ అధికారం నుండి దించేసి ప్రతిపక్షములో కూర్చోబెడుతారనే విషయాన్నీ అధినాయకులు ఎప్పుడు గుర్తెరికి నడుచుకుంటే మంచింది. ప్రస్తుతం తెలంగాణలో ఉద్యమ పార్టీ తెరాస అధినేత కేసీఆర్ అవలంబిస్తున్న విధానం చూస్తుంటే ఒక రకమైన నియంతృత్వం కనిపిస్తుంది.

ఆర్టీసీ సంఘాలతో ఢీ అంటే ఢీ అంటూ ముందుకి వెళ్తున్నాడు కేసీఆర్. కేవలం ఆర్టీసీ లో 1200 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఎవరికీ వల్లే ఉద్యోగాల నుండి తప్పుకున్నారంటూ పుండుమీద కారం చల్లే విధంగా కేసీఆర్ మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్, తెలుగుదేశం ఉన్నప్పుడు సమ్మెలు చేసినట్లు ఇప్పుడు చేస్తామంటే కుదరదు. అప్పటికి, ఇప్పటికి తేడా లేదా..? అంటూ కేసీఆర్ ప్రశ్నిస్తున్నాడు. అప్పటికి ఎప్పటికి తేడా ఉంటే ఎందుకు ఉద్యోగ సంఘాలు ఇంతలా తమ ఉద్యోగులను పణంగా పెట్టి ఉద్యమాలు చేస్తారు.

ఒక్కప్పుడు ఉద్యోగుల చేసిన ఉద్యమాల వలనే కేంద్రం దిగివచ్చి తెలంగాణ ఇచ్చింది. కేసీఆర్ ఒక్కడే ఏమి తెలంగాణ తీసుకోని రాలేదు. అందులో ఇలాంటి ఉద్యోగుల త్యాగాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు కేసీఆర్ కంటికి హీరోలుగా కనిపించిన ఉద్యోగులు నేడు విలన్స్ మాదిరి కనిపిస్తున్నారు. అందుకే వాళ్ళ విషయంలో కేసీఆర్ మంకుపట్టు కూర్చుకున్నాడు. ఎలాంటి చర్చలు లేవంటూ ఖరాకండిగా చెపుతున్నాడు. పాత ఉద్యోగులను తీసేసి, కొత్తవాళ్ళని తీసుకుంటామని అందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించాడు. అది బెదిరింపు కోసం చెప్పాడా..? నిజంగా అలాగే చేస్తున్నాడా ..? అనేది చూడాలి. కేసీఆర్ నోటితో చెప్పింది,చేతితో చేస్తే మాత్రం 2023 కి తెరాస ప్రతిపక్షములో కూర్చోవటం ఖాయం.