సీఎం జగన్ ని అభినందిస్తున్న సీఎం కేజ్రీవాల్ – ఎందుకంటే…?

Monday, December 16th, 2019, 12:54:18 PM IST

తెలంగాణ రాష్ట్రంలో సంచలన సృష్టించిన దిశ హత్య కేసు దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగిలిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇలాంటి ఘటనలు ఏపీలో జరగకుండా ఉండేందుకు ముందుగానే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగానే మహిళలకు రక్షణగా దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే చట్టాన్ని ఇప్పటికే కేబినెట్, అసెంబ్లీ, శాసన మండలి కూడా ఆమోదం తెలిపింది. అయితే ఈ దిశ చట్టం ప్రకారం.. అత్యాచార కేసు నమోదైన 14 రోజుల్లో దర్యాప్తు, విచారణ పూర్తి చేసి సరైన సాక్ష్యాధారాలు ఉంటే దోషులకు కేవలం 21 రోజుల్లోనే శిక్ష అమలు చేయాల్సిందిగా చట్టాన్ని తీసుకొచ్చారు.

అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ చట్టం చేసిందందుకు గాను సీఎం జగన్ కి ఎంతో మంది ప్రముఖులు, సినీ, రాజకీయ ప్రముఖులు అందరు కూడా ప్రశంసల వర్షాన్ని కురిపించారు. కాగా ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పై, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రశంసిస్తూ, ఒక లేఖ కూడా రాసారు. కాగా అంతేకాకుండా ఈ దిశ చట్టానికి సంబంధించిన బిల్లును పంపాలని లేఖలో కేజ్రీవాల్ కోరారు. కాగా ఇలాంటి చట్టాన్ని తాము కూడా చేసేందుకు ప్రణాళికలు చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.