సీఎం రమేష్ ఆవేదన – చంద్రబాబుకి ఏ పాపం తెలియదు

Sunday, August 11th, 2019, 06:26:18 PM IST

ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీ దారుణంగా ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి అద్వానంగా మారిపోయింది. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అనుకోవచ్చు కానీ, ఇలాంటి ఓటమి మాత్రం టీడీపీకి మొదటిసారి అనే చెప్పాలి. ఆ ఓటమి తర్వాత బాబు అమెరికాకి వెళ్లిన సమయంలో టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు వెళ్లి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పట్లో దీనిపై పెద్ద దుమారమే రేగింది .

చంద్రబాబు నాయుడు కావాలనే సీఎం రమేష్ ని, సుజాన్ చౌదరిని బీజేపీలోకి పంపారనే మాటలు పెద్ద స్థాయిలో వినవచ్చాయి. తాజాగా దీనిపై సీఎం రమేష్ మాట్లాడుతూ తనను చంద్రబాబే బీజేపీలోకి పంపించారని జరుగుతున్న ప్రచారాన్ని తప్పుపట్టారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారు అందుకు తగిన ఆధారాలు చూపించగలరా ? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు తనను ఎందుకు బీజేపీలోకి వెళ్లమని ప్రోత్సహిస్తారంటూ సీఎం రమేశ్ ఎదురు ప్రశ్నించారు.