ఏళ్ల తరబడి జైల్లో కూర్చుని బిర్యానీ తింటున్నారు..ఆవిషయం తెలియదా..?

Wednesday, November 2nd, 2016, 05:08:12 PM IST

cm-shivraj-singh-chouhan
సిమి ఉగ్రవాదుల ఎన్కౌంటర్ వివాదం మధ్య ప్రదేశ్ లో దుమారం రేపుతోంది.ఒక్కొక్కర్ని రెండుసార్లు పోలీస్ లు కాల్చారని, వారిని అరెస్టు చేసే అవకాశం ఉన్నా పోలీసులు ఎన్కౌంటర్ చేయడం దారుణమని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. వీటి పై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ఉగ్రవాదులు ఏళ్ల తరబడి జైలులో కూర్చుని బిర్యానీలు తింటున్నారని అన్నారు. అంతేకాకుండా జైలు నుంచి పారిపోయి ఎన్నో నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఉగ్రవాదులకు సంభందించిన కేసులను పరిష్కరించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలనీ అన్నారు.ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో అమరులైన పోలీస్ లగురించి ప్రతిపక్షం ఎందుకు స్పందించదని ఆయన కౌంటర్ వేశారు.

సిమి ఉగ్రవాదుల పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం పోలీస్ లు వారిని రెండుసార్లు కాల్చినట్లు తెలుస్తోంది.ఉగ్రవాదుల దగ్గర నాలుగు నాటు తుపాకులు కనుగొన్నట్లు పోలీస్ లు తెలిపారు.