సీఎం యోగి ప్రభుత్వం మరొక సంచలనమైన నిర్ణయం – ఏంటో తెలుసా…?

Saturday, May 23rd, 2020, 07:00:10 PM IST

యూపీ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ప్రభుత్వం తాజాగా ఒక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకుంది. కాగా ముఖ్యమంత్రి తీసుకున్ననిర్ణయం రాష్ట్రంలో కీలకం కానుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా ఆరు నెలలపాటు రాష్ట్రంలో అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) ప్రయోగిస్తున్నట్టు యూపీ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. కాగా రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ అనుమతి మేరకు రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి ముకుల్ సింఘాల్ నేడు అధికారికంగా సంబంధిత ఉత్తర్వులను జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో ఈ నూతన ఆదేశాలను అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

కాగా ఈ నూతన ఎస్మా చట్టం అమల్లో ఉండగా రైల్వే, టెలిగ్రాఫ్ , పోస్టల్ కార్యకలాపాలు సహా అత్యవసర సేవల విభాగాలకు చెందిన ఉద్యోగులెవరూ కూడా సమ్మె చేయడానికి అవకాశం లేకుండా ఈ నిషేధం కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా ఈ నూత్న చట్టాన్ని ఎవరైనా ఉల్లంగిస్తే మాత్రం వారికి దాదాపుగా ఏడాది పాటు జైలుశిక్ష లేదా రూ.1000 జరిమానా లేదా రెండు శిక్షలు ఒకేసారి విధించే అవకాశముంది, అంతేకాకుండా ఈ నూతన చట్టం ప్రకారం ఎలాంటి అరెస్టు వారెంటు లేకుండానే అరెస్ట్ చేసే అధికారం ఉందని అధికారులు వెల్లడించారు. .