జ‌గ‌న్ దూకుడు..కేంద్రం ఆంక్ష‌లు బేఖాత‌ర్‌!

Tuesday, June 11th, 2019, 09:15:48 PM IST

కేంద్ర ప్ర‌భుత్వ ఆదేశాల‌ను బేఖాత‌రు చేస్తూ ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ దూకుడు పెంచారు. గ‌త ప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పందాల‌ని పునః స‌మీక్ష పేరుతో మారుస్తూ పోతే రాష్ట్రానికి పెట్టుబ‌డులు రావ‌ని కేంద్రం వైఎస్ జ‌గ‌న్‌ను హెచ్చిరిస్తూ ఓ తాకీదును పంపించింది. దీన్ని జ‌గ‌న్ లెక్క‌చేయ‌కుండా త‌ను ఏం చేయాల‌నుకుంటున్నారో దాన్ని చేయ‌డానికే ముందడుగు వేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం విండ్ సోలార్ ఎన‌ర్జీస్‌, రెనివెబుల్ ఎన‌ర్జీ డెవెలాప‌ర్స్‌తో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దాన్ని తాజాగా అధికారంలోకి వ‌చ్చిన వైఎస్ జ‌గ‌న్ స‌మీక్షించ‌బోతున్నారు.

ఇది ఏపీలో అభివృద్ధికి అడ్డుక‌ట్ట‌గా మారే ప్ర‌మాదం వుంద‌ని ఇలాంటి స‌మీక్ష‌ల జోలికి వెళ్లొద్దంటూ కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌తినిధి ఏపీ సీఎస్‌కు ఇటీవ‌లే ఓ లేఖ రాశారు. దాన్ని ప‌ట్టించుకోకుండా విద్యుత్ కొనుగోళ్ల‌లో జ‌రిగిన అక్ర‌మాల‌ని బ‌య‌టికి తీయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో వైఎస్ జ‌గ‌న్ పీపీఏల పునః ప‌రిశీల‌న‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. త‌క్కువ ధ‌ర‌కు బ‌హిరంగ మార్కెట్‌లో విద్యుత్తు ల‌భిస్తుంటే అత్య‌ధికంగా కోట్ చేసి పీపీఏల కొనుగోలుకు ఒప్పందం చేసుకోవ‌డం ఏంట‌ని ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే వైఎస్ జ‌గ‌న్ గ‌త ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. తాజాగా ఆ ఒప్పందం వెన‌కున్న లావా దేవీల‌ను బ‌య‌టికి తీయాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌డంతో అందులో ఇన్‌వాల్వ్ అయి వున్న వారి గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి.