ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆట మొద‌లైంది!

Thursday, June 6th, 2019, 10:07:33 AM IST

ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించిన వైఎస్ జ‌గన్ త‌న ఆట మొద‌లుపెట్టారు. వ‌రుస సమీక్ష‌ల‌తో టీడీపీ నేత‌ల‌ను బెంబేలెత్తిస్తున్న ఆయ‌న టీడీపీపై త‌న వైఖ‌రి ఎంటో క్లియ‌ర్‌గా బ‌య‌ట‌పెట్టేశారు. ఇటీవ‌ల ఉండ‌వ‌ల్లిలోని త‌న నివాసానికి ద‌గ్గ‌ర‌గా వున్న ప్ర‌జావేధిక‌ని త‌న పార్టీ కార్య‌క‌లాపాల‌కు వాడుకునేలా వీటు క‌ల్పించి త‌నకు కేటాయించాల‌ని సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు నాయుడు ఓ లేఖ రాశారు. అయితే దానికి కౌంట‌ర్‌గా వైసీపీ వ‌ర్గం అదే వేదిక‌ను త‌మ పార్టీకి కేటాయించాల‌ని సీఎస్‌ని కోర‌డం ఆసక్తిక‌రంగా మారింది. దీంతో టీడీపీ శ్రేణులు, చంద్ర‌బాబు ఊహించ‌ని షాక్‌కు గుర‌య్యారు.

ప్ర‌తి ప‌క్ష హోదాలో త‌మ పార్టీ అధికారిక కార్య‌క‌లాపాల కోసం త నివాసానికి ప‌క్క‌నే వున్న ప్ర‌జావేదిక‌ను త‌మ‌కే కేటాయించాల‌ని బుధ‌వారం చంద్ర‌బాబు నాయుడు సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు లేఖ రాశారు. అయితే ఈ లేఖ పంపిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే వైసీపీ ఈ వేదిక‌ను త‌మ‌కే కేటాయించాలంటూ ప‌ట్టుబ‌ట్ట‌డంతో రానున్న రోజుల్లో టీడీపీ ప‌ట్ల వైసీపీ వైఖ‌రి ఎలా వుండ‌బోతోందో అర్థ‌మ‌వుతోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. అధికారంలో వుండ‌గా జ‌గ‌న్‌ని చంద్ర‌బాబు ఆడుకుంటే అధికారంలోకి వ‌చ్చాక జ‌గ‌న్ ఆట మొద‌లుపెట్ట‌క ఊర‌కే వుంటాడా?. ఆట మొద‌లైంది..ఇక వేట త‌ప్ప‌దు అని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. క‌ళ్ల ముందు జ‌గ‌న్ స‌మీక్ష‌లు నిర్వ‌హించ‌డం చూసి చంద్ర‌బాబు అక్క‌డే వుంటారా? లేక ఉండ‌వ‌ల్లిలోని నివాసాన్ని ఖాలీ చేసి మ‌రో చోటికి మ‌కాం మార్చేస్తారా అన్న‌ది చూడాలి.