జ‌గ‌న్‌కు ముఖ్య‌మంత్రి పీఠం ముళ్ల కిరీట‌మేనా?

Saturday, June 1st, 2019, 01:24:52 PM IST

ఏపీ ముఖ్య‌మంత్రి పీఠం ముళ్ల కిరీట‌మేనా? అంటే అవున‌నే అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. ఏపీ నుంచి తెలంగాణ విభ‌జ‌న త‌రువాత ఏర్ప‌డిన రాష్ట్రం కావ‌డం. మిగులు ఆదాయం లేక అప్పుల‌తో రాష్ట్రం ఏర్ప‌డ‌టం వంటి కార‌ణాల‌తో ఏపీ పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. ఉద్యోగుల‌కు జీతాలు కూడా ఇవ్వ‌లేని స్థితిలో వుంది. గ‌త ప్ర‌భుత్వాన్ని న‌డిపిన చంద్ర‌బాబు నాయుడు చాలా మంది ఉద్యోగుల‌కు జీతాలు కూడా చెల్లించ‌లేదంటే ప‌రిస్థితి ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవ‌చ్చు. అలాంటి రాష్ట్రానికి యువ‌కుడు జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అయితే ఇది అత‌నికి ఊహించ‌ని భారాన్నే తెయ‌చ్చిపెడుతుంద‌ని, ప్ర‌స్తుతం ఉద్యోగుల‌కు బ‌కాయిలు చెల్లించాల‌న్నా అప్పుచేయాల్సిందేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

దీనికి తోడు జ‌గ‌న్ ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలు ప‌ధ‌కాల్ని అమ‌లు చేయాలంటే రాష్ట్ర ఖ‌జానా అంతంత మాత్ర‌మే. రాష్ట్ర ఖ‌జానాలో వున్న‌ది 150 కోట్లు మాత్ర‌మే. ప్ర‌స్తుత ఖ‌ర్చుల‌కు కావాల్సిన మొత్తం 5 వేల కోట్లు. ఖ‌ర్చుకు, ఆదాయానికి ఎక్క‌డా పొంత‌న కుద‌ర‌డం లేదు. దీన్ని అంయ‌చ‌నా వేయ‌డం కోస‌మే ప‌ద‌వీప్ర‌మాణం చేసిన డే వ‌న్ నుంచే కొత్త ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌మీక్షల మీద స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తూ ప‌రిస్థితిని అంచ‌నా వేస్తున్నారు. వివిధ శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్న జ‌గ‌న్ ప్ర‌స్తుతం ఆ శాఖ‌ల‌కు సంబంధించిన అధిక‌ర్ల‌ని ప‌రుగెత్తిస్తున్నారు. శాఖ‌ల ప‌ర‌మైన అంచ‌నాకు వ‌స్తే ఎంత వ్య‌యం అవుతోంది. ఎంత త‌గ్గించు కోవాలి అన్న దానికిపై స్ప‌ష్ట‌త వ‌స్తుంది. దాన్ని తెలుసుకునే క్ర‌మంలోనే స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు జ‌గ‌న్‌. అయితే అది అంత ఆశామాషీ వ్య‌వ‌హారం కాద‌ని, ఏపీ ముఖ్య‌మంత్రి పీఠం జ‌గ‌న్‌కు ముళ్ల కిరీట‌మేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబ‌తున్నారు.