వైసీపీ అభిమానులు కాలర్ ఎగరేసి మరీ చెప్పుకుంటారుగా..!

Thursday, June 6th, 2019, 08:37:12 AM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే గత నెల 30వ తేదిన ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌లో స‌మ‌య‌పాల‌న‌, క్ర‌మ శిక్ష‌ణ‌, చిత్త‌శుద్ధిపై రాష్ట్ర అధికారులు చ‌ర్చించుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవ‌ల విద్యాశాఖ‌పై జ‌రిగిపిన తొలి స‌మీక్ష‌కు హాజ‌రైన జ‌గ‌న్ స‌మావేశానికి వ‌చ్చిన ఆరంభంలోనే అధికారులంద‌రిని మర్యాదపూర్వకంగా ప‌రిచ‌యం చేసుకున్నారు.

అంతేకాకుండా జ‌గ‌న్ అధికారుల‌ను అన్నా అన్న పిలుపుతో పిలుస్తూ, ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ఆదిత్య‌నాథ్‌దాస్‌ని ప‌క్క‌న కూర్చోబెట్టుకుని స‌మీక్షించారు. అలాగే మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం, పాఠశాల‌లు ఎలా ఉండాలి అన్న అంశాల‌పై సీఎం జ‌గ‌న్‌కు ఉన్న స్ప‌ష్ట‌త క‌మిట్‌మెంట్ అధికారుల‌ను ముగ్దుల‌ను చేసింది. అంతేగాక ఆర్థిక‌, రెవెన్యూశాఖపై రివ్యూ సంద‌ర్భంగా కూడా ఇదే దృశ్యం క‌నిపించింది. స‌మీక్షా స‌మావేశంలో భాగంగా అధికారులు నిల‌బ‌డి మాట్లాడే ప్ర‌య‌త్నం చేయ‌గా, ఎవ‌రూ నిలబడి మాట్లడకండి కూర్చొనే మాట్లాడుకుందాం అంటూ సీఎం జ‌గ‌న్‌ అధికారులను గౌర‌వించ‌డాన్ని అధికారులు స‌మీక్షా స‌మావేశం ముగిసిన త‌రువాత బ‌య‌ట‌కొచ్చి సీఎం హొదాలో ఉన్న జగన్‌కు ఏ మాత్రం గర్వం లేదని అధికారులకు ఇచ్చే గౌరవం ఇంత కూడా తగ్గలేదని నిజంగా ఇలాంటి సీఎంని చూడలేదని అధికారులు చెప్పుకొచ్చారు.