పీఎం మోడీ కి లేఖ రాయనున్న సీఎం జగన్… ఎందుకంటే?

Tuesday, May 4th, 2021, 07:45:08 PM IST


ప్రధాని నరేంద్ర మోడీ కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాయనున్నారు. 45 ఏళ్లు పైబడిన వారందరికీ వాక్సినేషన్ లో ప్రాధాన్యం ఇవ్వాలని నేడు జరిగిన మంత్రి మండలి సమావేశం లో చర్చించారు. అయితే ఇదే విషయం గురించి ప్రధాని నరేంద్ర మోడీ కి జగన్ లేఖ రాయనున్నారు. అయితే మంత్రి వర్గం తో సమావేశం అయిన జగన్ పలు కీలక అంశాల పై చర్చ జరిపారు. కరోనా కట్టడి మరియు వాక్సినేషన్ అంశాల పై ప్రధానం గా చర్చ జరిపారు. అయితే ఆక్సీజన్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు నుండి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలను జారీ చేశారు. అంతేకాక రేపటి నుండి అమలు చేయనున్న కర్ఫ్యూ పై సైతం సీరియస్ గా వ్యవహరించాలి అని వ్యాఖ్యానించారు. అయితే పగటి పూట కర్ఫ్యూ గురించి కీలక చర్చ జరిపినట్లు తెలుస్తోంది.