రివర్స్ టెండరింగ్ పై జగన్ మరొక కీలక నిర్ణయం

Thursday, October 10th, 2019, 12:44:32 AM IST

ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని దక్కించుకున్న తరువాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా తగ్గకుండా, ఎన్నో కీలకమైన నిర్ణయాలని తీసుకుంటూ దూసుకుపోతున్నాడు జగన్. కాగా తాజాగా సీఎం జగన్ మరొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ప్రజలందరికి కూడా ఉపయోగపడేలాగా ప్రజాధనాన్ని ఆదా చేయాలనే అంశంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. కాగా రూ.10 లక్షల నుంచి రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని సీఎం జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంట. ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలకు, పనులకు అన్నింటికీ కూడా రివర్స్ టెండరింగ్ పెట్టాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ కొత్త నిర్ణయం మాత్రం జనవరి 1 నుండి అమలులోకి రానుందని సమాచారం. అంతేకాకుండా ఇకమీదట ఏవైనా కొనుగోళ్ల విషయంలో కూడా ఇలాగే పారదర్శకత ఉండాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నాడట. ఇకపోతే ఇటీవల సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ ప్రవేశపెట్టినప్పుడు వచ్చిన ప్రేక్షకాదరణకు దాదాపుగా విపక్షాలు కూడా కొందరు మద్దతు తెలిపారని, అంతేకాకుండా ప్రజలందరికి ఉపయోగ పడేలా ఏర్పాటు చేసే పథకాలను అందరు కూడా ఆదరిస్తారని నమ్ముతున్నారు జగన్ ప్రభుత్వ అధికారులు.