కోటి 20 లక్షలు అన్ని 1 రూపాయి నాణేలే.. మొత్తం నేలపాలు..!

Saturday, November 26th, 2016, 01:33:35 PM IST

cains
రాజస్థాన్ లో జరిగి ఓ రోడ్డు ప్రమాదంలో 1 రూపాయి నాణేలను మోసుకెళుతున్న లారీ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం లో ట్రక్కులో ఉన్న నాణేలని నేలపాలు అయిపోయాయి. కోటి 20 లక్షల నాణేలు అన్ని ట్రక్కులోనించి రోడ్ పై పడిపోయాయి. సమాచారం తెలుసుకుని పోలీస్ లు అక్కడికి చేరుకునే లోపే దాయపు 15 లక్షల నాణేలు మాయమై పోయాయి.

సమాచారం తెలుసుకున్న పోలీస్ లు అక్కడికి చేరుకొని ఆ నాణేలన్నటిని సేకరించి మరో వాహనంలో గమ్యానికి చేర్చారు. లెక్కలు చూసుకున్న తరువాత తెలిసింది. 15 లక్షల నాణేలు మాయమైపోయాయని. రోడ్ పై వెళుతున్న వాహనదారులు, ప్రమాదాన్ని గమనించిన వారు నాణేలను తీసుకుని వెళ్లి ఉంటారని పోలీస్ లు భావిస్తున్నారు.