1000 కోట్లు సొంతంగా సంపాదించుకున్నా: శింబు

Wednesday, June 6th, 2018, 05:41:48 PM IST

కోలీవుడ్ యువ హీరో శింబు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటాడని అందరికి తెలిసిందే. అలాగే శింబుతో సినిమా చేస్తే చాలా కష్టమని షూటింగ్ లకు సమయానికి రాడని ఓ కామెంట్ ఉంది. ఇక రీసెంట్ గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌, పాండిరాజ్‌, అధిక్ రవిచంద్రన్‌ ఆ విషయం గురించి మీడియాతో మాట్లాడగా హీరో శింబు తన నుంచి ఒక ప్రకటన ద్వారా వివరణ ఇచ్చాడు.

నేను నా తండ్రితో కలిసి సినిమా చేసినప్పుడు 10 గంటలకు షూటింగ్ కు వచ్చేవాన్ని. దర్శకనిర్మాతల మాటలు వినను అని కాదు. నేను నాకు ఇష్టం వచ్చినట్లు ఉంటాను. నన్ను చాలా గారాబంగా పెంచారు. నేను ఇలానే పెరిగాను. ఇలానే ఉంటాను. ఒక రోబోలా పని చేయలేను. నా పేరెంట్స్ ఆస్థి కాకుండా సొంతంగా 1000 కోట్లవరకు సంపాదించుకున్నా. నేను హ్యాపీగా బ్రతగగలను. పబ్లిక్ కి ఆ విషయం అర్ధం కావడం లేదు. నాకు ఇష్టం కాబట్టి సినిమాలను చేస్తున్నా. ఇక ఎవరినైనా కావాలని బాధపెట్టాలని నేను ఎప్పుడు అనుకోను. అలా అయితే నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తా అని శింబు తెలిపాడు.