వీడియో : అభిమానుల కాళ్లు మొక్కిన సూర్య

Thursday, January 11th, 2018, 12:54:06 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సంక్రాంతికి గ్యాంగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. తెలుగులో కూడా ఆ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. అయితే రీసెంట్ గా చిత్ర యూనిట్ తమిళ్ ప్రీ రిలీజ్ వేడుకని నిర్వహించారు. అయితే వేడుకలో కొందరి అభిమానులతో సూర్య డ్యాన్స్ చేశాడు. అయితే ముందుగా సూర్య అభిమానుల్ని స్టేజ్ పైకి పిలువగా వారు ఒక్కసారిగా కాళ్లపై పడ్డారు. దీంతో సూర్య కూడా ఎవరు ఊహించని విధంగా తీరిగి వారి కాళ్లపై పడ్డాడు. ఆ తరువాత అలా చేయకూడదని చెప్పి సినిమాలోని ఒక పాటకు మాస్ స్టెప్పులు వేశారు. అభిమాన హీరోతో డ్యాన్స్ చేసే సరికి ఆ యువకులు చాలా ఆనందం కలిగింది. ఆ తరువాత హీరోని ప్రేమగా కౌగిలించుకున్నారు. సూర్యా కూడా వారి ప్రేమకు ఫిదా అయ్యాడు. ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఇక గ్యాంగ్ సినిమా శుక్రవారం రిలీజ్ కాబోతోంది. విగ్నేష్ శివన్ దర్శకత్వ వహించిన ఆ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.