గ్లామర్ డోస్ కు రెడీ అయిన తెలుగు భామ ?

Sunday, February 19th, 2017, 11:47:58 AM IST


తెలుగు పిల్ల కలర్స్ స్వాతి ఈ మధ్యలో ఎక్కడ కనిపించడం లేదు. ”త్రిపుర” సినిమా ప్లాప్ అవ్వడంతో ఈ అమ్మడికి పెద్దగా ఆవకాశాలు రాలేదు . దాంతో గ్యాప్ వచ్చింది. తెలుగులో కంటే తమిళంలోనే మంచి పేరు తెచ్చుకున్న స్వాతి కు అక్కడ కూడా అవకాశాలు తగ్గాయి. దాంతో ఏడాది గ్యాప్ తీసుకోవలసి వచ్చింది. హీరోయిన్ గా గ్లామర్ కు దూరంగా ఉన్న స్వాతి మన పక్కింటి అమ్మాయిగా ఆకట్టుకుంది, కానీ త్రిపుర సినిమాతో భయపెట్టి హిట్ అందుకోవాలనుకున్న స్వాతి కి ఆ సినిమా డిజప్పాయింట్ చేసింది. అందుకే ఇప్పుడు ట్రెండ్ మార్చాలని ఫిక్స్ అయిందట స్వాతి అందుకే .. లేటెస్ట్ గా ఓ రొమాంటిక్ డ్రామాలో నటించేందుకు ఓకే చెప్పింది ? ఆదిత్య అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చడంతో ఈ సినిమాకు ఓకే చెప్పిందట, రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కే ఈ సినిమాతో గ్లామర్ డోస్ పెంచాలని ఫిక్స్ అయిందట !! వచ్చే నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.