ప్రేమ వివాహం చేసుకున్న .. కలర్స్ స్వాతి ?

Saturday, September 1st, 2018, 11:11:51 AM IST

టెలివిజన్ తెరపై కలర్స్ ప్రోగ్రాం తో సందడి చేసిన కలర్స్ స్వాతి ఆ తరువాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. తాజాగా ఆమె ప్రేమించి ప్రేమ వివాహం చేసుకుంది. గత కొంత కాలంగా వికాస్ తో ప్రేమాయణం సాగిస్తున్న స్వాతి .. ఇరు కుటుంబాలను ఒప్పించి నిన్న వివాహం చేసుకుంది. వికాస్ పైలట్ గా పనిచేస్తున్నాడు. ఇరు కుటుంబాల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. హీరోయిన్ గా తెలుగులో ఇమేజ్ తెచ్చుకోవాలనుకుంది కానీ ఆమె ఆశలు నిరాశలయ్యాయి. మరో వైపు తెలుగు అమ్మాయిలకు కోలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రయత్నాలు మొదలు పెట్టింది .. అక్కడ అదే పరిస్థితి. దాంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి. తాజాగా సినిమాలు లేకపోవడంతో పెళ్లి చేసుకుంది. హీరోయిన్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్, ప్లే బ్యాక్ సింగర్ గా ఇమేజ్ తెచ్చుకున్న స్వాతి మరి పెళ్లి తరువాత సినిమాలు చేస్తుందా లేక హౌస్ వైఫ్ గా సెటిల్ అవుతుందా అన్నది చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments