బౌండ్ స్క్రిప్టు ఉంటేనే రండి!

Thursday, September 13th, 2018, 03:31:38 PM IST

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ కొత్త రూల్స్ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాయా? అంటే అవున‌నే మాట్లాడుకుంటున్నారంతా. మ‌హేష్ ఇప్పుడు మారిన మ‌నిషి. కొన్ని వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత ఈసారి ప‌క్కా ప్లాన్‌తో ముందుకెళుతున్నాడు. ఇదివ‌ర‌కటిలా ఏదీ తేలిగ్గా తీసుకోవ‌డం లేదు. స్పైడ‌ర్, బ్ర‌హ్మాస్త్రం లాంటి డిజాస్ట‌ర్లు నేర్పిన పాఠంతోనే అత‌డు శ్రీ‌మంతుడు, భ‌ర‌త్ అనే నేను లాంటి మంచి స్క్రిప్టుల్ని ఎంచుకోగ‌లిగాడని విశ్లేషిస్తున్నారు.

ఆ రెండిటిని పూర్తిగా బౌండ్ స్క్రిప్టులుగా చూసుకున్న త‌ర్వాత‌నే మ‌హేష్ పూర్తిగా ముందుకెళ్లాడు. అలా బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాల్ని అందుకున్నాడు. ఇక‌పై అదే పాల‌సీని అనుస‌రించ‌నున్నాడ‌ట‌. అంటే ఎవ‌రైనా ద‌ర్శ‌క‌ర‌చ‌యిత మ‌హేష్ కి క‌థ వినిపించాలంటే కేవ‌లం లైన్ ప‌ట్టుకుని, అర్థ‌గంట నేరేష‌న్ వినిపిస్తాన‌ని త‌న‌వ‌ద్ద‌కు వెళితే అస్స‌లు విన‌రు. పూర్తిగా బౌండ్ స్క్రిప్టుతో త‌న‌వ‌ద్ద‌కు రావాల్సిందే. అప్పుడు మాత్ర‌మే మొత్తం స్క్రిప్టు వినేందుకు టైమ్ కేటాయిస్తారు. ఆ మేర‌కు టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ & రైట‌ర్స్‌కి ఉత్త‌రువు అందిన‌ట్టేన‌ని తెలుస్తోంది. మ‌హేష్ ప్ర‌స్తుతం కెరీర్ 25వ సినిమా మ‌హ‌ర్షిలో న‌టిస్తున్నాడు. వంశీ పైడిప‌ల్లి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. త‌దుప‌రి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా, సందీప్ రెడ్డి వంగ ద‌ర్శ‌క‌త్వంలో వేరొక సినిమా చేయ‌నున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments