పవన్ కళ్యాణ్, కత్తి మహేష్ ల కాంట్రావర్సీ పై పృథ్వి స్పందన!

Thursday, January 11th, 2018, 08:00:27 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ ల మధ్య నడుస్తున్న వివాదం రోజుకో విధంగా మలుపు తిరుగుతోంది. ఇప్పటివరకు పూనమ్ కౌర్, నటి సంజన, డైరెక్టర్ వివేక్ , కోన వెంకట్ వంటి వారు పవన్ కి అనుకూలంగా స్పందించారు. అయితే ఇప్పుడు 30 ఇయర్స్ పృథ్వి కూడా ఈ వరసలో వచ్చి చేరారు. ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ దర్శక దిగ్గజం, ఇండస్ట్రీ మొత్తానికి ఆప్తులు, పెద్ద అయిన దాసరి నారాయణ రావు లేకపోవడం వల్లనే ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారని, ఆయన మృతి తనని తీవ్రంగా కలిచి వేసిందని, అలాగే ప్రస్తుతం రాష్ట్రం లో బర్నింగ్ ఇష్యూ గా వున్న పవన్ మరియు కత్తి మహేష్ ల కాంట్రవర్సీ పై మాట్లాడుతూ ఎవరైనా టాలీవుడ్ కి చెందిన ప్రముఖులు పూనుకుని కత్తి మహేష్ ని, పవన్ అభిమానులని ఒక వేదికపై కూర్చోపెట్టి మాట్లాడితే వివాదానికి మెల్లగా ముగింపు పలకవచ్చని ఆయన అన్నారు.

పవన్ ఫాన్స్, కత్తి మహేష్ ఇలా ఒకరి పై ఒకరు మాటల యుద్ధం పెంచుకోవడం వల్ల వివాదం పెరుగుతుందని, ఇది మంచి పరిణామం కాదని ఆయన అన్నారు. అలాగే తనకి మెగా ఫామిలీ అన్నా , మెగా హీరోలన్నా ప్రత్యేకమైన గౌరవమని, కత్తి మహేష్ కూడా పవన్ ని స్థాయి ని తగ్గించేలా మాట్లాడడం కరెక్ట్ కాదు అన్నారు , అంతే కాక తమ అభిమాన హీరోని ఎవరైనా తిడితే వెంటనే ఫాన్స్ రియాక్ట్ అవడం కామన్ అని ఆయన అభిప్రాయపడ్డారు, నటుడు జి వి కూడా కత్తి మహేష్ కి కొన్ని ప్రశ్నలు సాధించారని , వారిద్దరిని ఒక వేదికపై కూర్చోపెట్టి మాట్లాడితే వివాదం ఒక కొలిక్కి రావొచ్చేమో అన్న అభిప్రాయాన్ని ఆయన వెలిబుచ్చారు. మొత్తానికి పృథ్వి స్పందనకి అటు కత్తి మహేష్ నుండి, ఇటు పవన్ ఫాన్స్ నుండి ఎటువంటి స్పందన వస్తుందో వేచి చూడాలి…