దర్శకుడిగా మారుతున్న కమెడియన్ .. రవితేజ హీరో ?

Wednesday, October 25th, 2017, 10:56:23 AM IST

కమెడియన్స్ హీరోలుగా మారిన సంగతి తెలిసిందే. ఇక కమెడియన్స్ దర్శకులుగా ప్రయోగాలు చేసారు. తాజాగా మరో పాపులర్ కమెడియన్ దర్శకుడిగా సన్నాహాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది ? ఈ మద్యే హీరోగా ఇన్నింగ్ మొదలు పెట్టిన ఆ కమెడియన్ దర్శకుడిగా టర్న్ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది? ఇంతకీ ఎవరా కమెడియన్ ఏమా కథ అంటే .. !! కమెడియన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రీనివాస్ రెడ్డి అటు హీరోగా గీతాంజలి, ఆనందో బ్రహ్మ వంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు. తాజాగా అయన దర్శకుడిగా మారుతున్నాడు. అయితే అయన దర్శకత్వంలో నటించే హీరో ఎవరో తెలుసా రవితేజ ? ఏంటి షాక్ అవుతున్నారా ? ఇది నిజం ఇప్పటికే మంచి కథను సిద్ధం చేసుకున్న శ్రీనివాస్ రెడ్డి లేటెస్ట్ గా రవితేజ కు కథ వినిపించాడట, కథ నచ్చడంతో ఓకే చెప్పాడని టాక్ ? ఇప్పటికే కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్న రవితేజ, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి కి ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది!! సో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రానుంది. ప్రస్తుతం రవితేజ టచ్ చేసి చూడు సినిమాలో నటిస్తున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments