స్టార్ కమెడియన్ కాంట్రవర్షియల్ ట్వీట్

Friday, May 4th, 2018, 01:06:53 AM IST

బాయ్స్ సినిమా ద్వారా తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి క్రేజ్ అందుకున్న హాస్య నటుడు వివేక్. శంకర్ చిత్రాల్లో ఆయన చేసిన పాత్రలకు టాలీవుడ్ ఆడియెన్స్ కి బాగానే పరిచయమయ్యారు. ఇకపోతే వివేక్ సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు ఎదో ఒక విషయంపై తనదైన శైలిలో స్పందిస్తుంటాడు. అయితే రీసెంట్ గా ఆయన చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒక సెలబ్రెటీ హోదా లో ఉండి లింగ బేధాలు చూపించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.

ఇంతకు వివేక్ ఎలాంటి ట్వీటేశాడంటే.. వేసవి సెలవులు వచ్చాయి కదా.. డియర్ స్టూడెంట్స్ సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ ని ఎంజాయ్ చేయండి. ఇష్టమైన ఆటలతో బిజీ అవ్వండి. గేమ్స్ తరువాత నీళ్లు ఎక్కువగా తాగండి. ఆడపిల్లలు వంట గదిలో ఉంటూ వంట నేర్చుకోండి. మగ పిల్లలు వారు తండ్రి చేసే వర్క్ ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీ ఫ్యామిలీ కోసం మీ తండ్రి ఏం చేస్తున్నాడు ఎంత కష్టపడుతున్నాడు అనే విషయం తెల్సుకొని బలంగా ఉండండని ట్వీట్ చేయగా. ఎందుకు లింగ బేధాలు చూపిస్తున్నారు. ఆడపిల్లలు వంట గదిలోనే ఉండాలా? ఏ తండ్రి బాటలో ఆమె ఎందుకు నడవకూడదు. మగ పిల్లలు వంట ఎందుకు నేర్చుకోకూడదు అంటూ నెటిజన్స్ రిప్లై ఇస్తున్నారు. మరి వివేక్ ఈ విషయాలపై ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.