డ్రంక్ అండ్ డ్రైవ్.. కారు కింద అడ్డంగా బుక్కైన కమెడియన్..!

Sunday, December 3rd, 2017, 07:53:56 PM IST

‘గుండె జారీ గల్లంతయ్యిందే’ చిత్రంలో యంగ్ కమెడియన్ నవీన్ హిజ్రా పాత్రలో పండించిన కామెడీ అందరిని కడుపుబ్బా నవ్వించింది. ఆ చిత్రం ద్వారా నవీన్ పాపులారిటీ సంపాదించాడు. ఆ తరువాత కూడా నవీన్ కొన్ని చిత్రాల్లో కమెడియన్ గా అవకాశాలు అందుకున్నాడు. కాగా నేడు నవీన్ వ్యవహార శైలి పోలీస్ లకు సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఆదివారం బంజారాహిల్స్ ప్రాంతంలో పోలీస్ లు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ ఆపరేషన్ నవీన్ పట్టుబడ్డాడు. పోలీస్ లని గమనించిన నవీన్ కారు కింద దాక్కునే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే నవీన్ పోలీస్ ల కంట పడడంతో అతడి కారుని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. నలుగురు యువతులపై కూడా పోలీస్ లు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసారు.

  •  
  •  
  •  
  •  

Comments