ఈ నెలలోనే సింగపూర్ ప్రయాణమట!

Saturday, September 13th, 2014, 05:16:14 PM IST


ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని విషయమై శనివారం సచివాలయంలో రాజధాని కమిటీ సమావేశమై చర్చించింది.అనంతరం ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ సెప్టెంబర్ నెల 22 నుండి 26 వరకు రాజధాని కమిటీ సింగపూర్ లో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే అక్టోబర్ 5 నుండి 9వ తేదీ వరకు చైనాలోని మూడు నగరాల్లో కమిటీ పర్యటిస్తుందని నారాయణ తెలిపారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ఇప్పటి వరకు చూసిన రాజధాని నగరాల్లో చండీఘడ్ నమూనా బాగుందని వివరించారు. ఇక రాజధాని నిర్మాణానికి కనీసం 5వేల హెక్టార్ల భూమి అవసరమని, అందుకోసం ప్రభుత్వ భూముల వివరాలు అందచేయాల్సిందిగా కృష్ణా, గుంటూరు కలెక్టర్లను ఆదేశించామని మంత్రి నారాయణ వివరించారు. కాగా తెలంగాణ విభాజిత అవశేష ఆంధ్రప్రదేశ్ కు నూతన రాజధాని నమూనా కోసం ఏపీ రాజధాని కమిటీ పలు రాష్ట్రాలు, దేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంగానే రానున్న రోజుల్లో కమిటీ సభ్యులు సింగపూర్, చైనా దేశాలు పర్యటించనున్నారు.