సామాన్యుడా మేలుకో..వైసీపీ నీ డబ్బు ఎలా ఖర్చు చేస్తుందో చూడు!

Tuesday, October 8th, 2019, 03:26:05 PM IST

ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాలను గమనిస్తున్నట్టయితే చాలా మందికి విసుగు వస్తుంది.చంద్రబాబు చేసిన డబ్బా రాజకీయాలు ఆర్భాట రాజకీయాలతో విసుగెత్తిన జనం ఇక బాబుగారి పరిపాలన వద్దు ఓసారి జగన్ కు అవకాశం ఇచ్చి చూద్దామని పట్టం కట్టారు.సామాన్యులు కూడా చాలా మందే జగన్ కు ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చారు.కానీ ఇప్పుడు జగన్ పరిపాలన చూస్తుంటే చాలా తెలివిగా చంద్రబాబుకు ఏమాత్రం తీసిపోనీ విధంగా ఉందని చెప్పాలి.

గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు అంతా పసుపుమయం చేసేశారని ప్రజా ధనాన్ని వారి పార్టీ ప్రచారాలకు వాడుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని వాదించారు.మరి ఇప్పుడు వీరు అధికారంలోకి వచ్చారు వీరు మాత్రం ఒరగబెట్టింది ఏమన్నా ఉందా అంటే వాళ్లను మించే దుబారా ఖర్చులు చేస్తున్నారు.దేన్నీ వదలకుండా వారి పార్టీ జెండా రంగులతో నింపేస్తున్నారు.

ఊర్లలో ఉండే వాటర్ ట్యాంక్ ల నుంచి గ్రామ పంచాయితీలకు సహా అంతా వైసీపీ జెండా రంగులతో నింపేస్తున్నారు.వీటికి వీరి జేబులోనుంచి తీసి ఇవ్వరుగా సామాన్య జనం కట్టిన పన్నుల నుంచే ఫ్రీగా మరో ఐదేళ్లు ప్రచారం చేసేసుకుంటున్నారు.ఇప్పుడు ఇదంతా ఎందుకు హాట్ టాపిక్ గా వచ్చింది అంటే ఊర్లలో పంచాయితీ కార్యాలయాలకు కూడా ఈ రంగులు వేసేస్తున్నారు.మరి రేపు రానున్న పంచాయితీ ఎన్నికలకు ఎన్నికల కోడ్ లో భాగంగా ఈ రంగులను ఖచ్చితంగా చెరపాలి.

ఆ తర్వాత ఎలాగో మళ్ళీ వేసేసుకుంటారు.అంటే ఇప్పుడు వేసిన రంగులకు అయ్యిన ఖర్చు అలాగే వాటిని చెరిపి మళ్ళీ వేస్తే వాటికయ్యే ఖర్చు కూడా సామాన్యుని కష్టార్జితంలోని పన్ను రూపమే.వీటి పేరు చెప్పి ఎన్ని కోట్లు ఎవరెవరి ఖాతాల్లోకి మళ్ళాయో కూడా ఎవరికీ తెలీదు.మరి వీటన్నిటి పైనా సామాన్యుడు ప్రశ్నిచకపోతే ఇంకెప్పుడు అప్పుల్లో ఉన్న రాష్ట్రాలు సుభిక్షంగా మారుతాయి?డబ్బులు తీసుకొని ఓట్ వేసిన వారికి ఇలాంటి వాటి మీద అడిగే హక్కును ఎలాగో కోల్పోతాడు.నిజంగా మార్పును కోరుకొని ఓట్ వేసినవాడే ఇప్పుడు వైసీపీ చేస్తున్న ఈ దుబారా ఖర్చు రాజకీయాలను ప్రశ్నించాలి.