సగటు తెలుగు ప్రేక్షకుడి ఆవేదన..!

Friday, September 7th, 2018, 05:10:36 PM IST

‘దేశ భాష లందు తెలుగు లెస్స” అన్నారు పెద్దలు. ప్రపంచంలో చదవడానికి రాయటానికి ఇంపుగా ఉండే భాష తెలుగు లాంటి భాష మరొకటి లేదు అని పాశ్చాత్త్యా దేశీయులు కొనియాడారు. కానీ మన తెలుగు సినిమాల్లో అంత ప్రేమ కనిపించట్లేదు. తెలుగు భాషా ప్రేమికులు తెలుగు సినీ ప్రేమికులు వాపోతున్నారు.

సమంత నటిస్తున్న “యు టర్న్” మరియు విజయ్ దేవర కొండ నటిస్తున్న కొత్త చిత్రం “నోటా” ఈ రెండు చిత్రాలు కూడా తెలుగు మరియు తమిళం రెండు భాషల్లో విడుదల కానున్నాయి ఐతే ఈ సినిమాలకి వేసిన పోస్టర్ల విషయంలో తెలుగు భాషా ప్రేమికులు కొద్దిగా బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఈ రెండు చిత్రాలు రెండు భాషల్లో విడుదల చేసేటప్పుడు తమిళ వెర్షన్ లో తమిళ భాషలో పేర్లు వేసినపుడు, తెలుగు వెర్షన్ కి తెలుగులో ఎందుకు పేర్లు వెయ్యలేదని ? తెలుగు భాష అంటే అంత తక్కువ అయ్యిపోయిందా అని సోషల్ మీడియాలో తమ బాధని వెళ్లగక్కుతున్నారు. ఏదేమైనా మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులని, మన మాతృ భాషని, పుట్టిన దేశాన్ని ఎప్పటి మర్చిపోకూడదు అని అందరు గుర్తుంచుకోవాలి.

  •  
  •  
  •  
  •  

Comments