ఇక టీడీపీలో ఆ స్తానం ఎవరిదీ…?

Wednesday, June 12th, 2019, 04:01:25 AM IST

ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో గోరమైన పరాజయాన్ని మూటకట్టుకున్న టీడీపీ ప్రస్తుతానికి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ని ఎలా ఎదుర్కొంటుంది అని సర్వత్రా ఆసక్తి రేకెత్తుతోంది. మొత్తం 175 మంది సభ్యులున్న ఏపీ అసెంబ్లీలో వైసీపీకి 151 సభ్యులు ఉండగా, టీడీపీకి 23, జనసేనకు 1 సభ్యుడు మాత్రమే ఉన్నారు. కాగా ఏపీలో అసెంబ్లీలోని ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి టీడీపీ శాసనసభాపక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహరించనున్నారు. కాగా టీడీఎల్పీ ఉపనేతలుగా వ్యవహరించే అవకాశం ఎవరికి దక్కుతుందని టీడీపీ వర్గాల్లో చర్చ మొదలైంది. అందరు కూడా ఈ పోస్ట్ కోసమే ఎదురు చూస్తున్నారు కూడా…

అయితే ఈ మేరకు చంద్రబాబు నాయుడు నేడు మొదలవనున్న శాసన సభలోనే నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. అయితే టీడీపీ శాసనసభాక్ష ఉప నేతలుగా ఎవరు ఉండాలి, విప్ ఎవరు అనేది చంద్రబాబు నిర్ణయం పైనే ఆధారపడి ఉంటున్నాడని టీడీపీ నేతలు అంటున్నారు. ప్రతిపక్షానికి దక్కే పీఏసీ చైర్మన్ పోస్టు టీడీపీలో ఎవరికి దక్కుతుందన్న అంశంపై టీడీపీలో ఆసక్తి నెలకొంది. పీఏసీ ఛైర్మన్ పదవి కోసం తెలుగుదేశంలో తీవ్రమైన పోటీ ఉందని సమాచారం. కరణం బలరాం, గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్.. పీఏసీ చైర్మన్ పదవి కట్టబెట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కాగా విప్‌గా పయ్యావుల కేశవ్‌ను ఎంపిక చేస్తారని ఎప్పటినుండో ప్రచారం జరుగుతోంది. ఇక డిప్యూటీ లీడర్లుగా చినరాజప్ప, గంటా, అచ్చెన్నాయుడు, కరణం బలరాం, బుచ్చయ్య చౌదరి పేర్ల పరిశీలనకు వచ్చాయని సమాచారం. సీనియర్లలో ముగ్గురికి డిప్యూటీ లీడర్లుగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది.