భయపడుతున్న రామ్ చరణ్.. కారణం స్ట్రాంగ్ గానే ఉంది

Wednesday, November 23rd, 2016, 11:55:09 PM IST

s3-n-dhruva
అల్లూ అరవింద్ చేసిన ప్రయత్నాలు ఫలించినట్టు ఎక్కడా కనపడ్డం లేదు. సింగం సినిమా రామ్ చరణ్ గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోంది. ధృవ వచ్చిన వారం తరవాత ఏ సినిమా లేదు కదా అని 9 న విడుదల తేదీ ప్రకటించాదం రామ్ చరణ్. అయితే డిసెంబర్ 16 న వచ్చేస్తున్నా అంటూ షాక్ ఇచ్చాడు. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలకి కనీసం రెండు వారాల గ్యాప్ ఉంటే కానీ పాజిటివ్ గా కలక్షన్ లు రావు. జనాలకి వేరే ఆప్షన్ లేక పెద్ద హీరో సినిమాకి వెళ్ళాలి అప్పుడే డబ్బుల వర్షం కురుస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ధృవ కి సింగం అడ్డం వచ్చేసింది. అయితే అల్లూ అరవింద్ తన శక్తి వంచన లేకుండా సింగం 3 వాయిదా గురించి చాలా కష్టపడ్డాడు. కానీ పని జరగలేదు. ‘ఎస్-3’ మీద తెలుగులోనూ భారీ అంచనాలుండటం.. పైగా మాస్ ఆడియన్స్ ఈ సినిమాపై చాలా ఆసక్తితో ఉండటంతో ధృవ వచ్చిన వారానికే ఈ సినిమా వస్తే ఇబ్బందని అల్లు అరవింద్ భావించాడు. తనకు సన్నిహితుడైన జ్నానవేల్ రాజాతో సంప్రదింపులు జరిపాడని.. సినిమాను వాయిదా వేయించడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నాడని వార్తలొచ్చాయి. ఐతే క్రిస్మస్ వీకెండ్లో ఇటు తెలుగులో.. అటు తమిళంలో చాలా సినిమాలు షెడ్యూల్ అయి ఉన్న నేపథ్యంలో ‘ఎస్-3’ని వాయిదా వేయడానికి కుదర్లేదు. దీంతో సూర్య అండ్ టీమ్ యధావిధిగా 16నే ‘ఎస్-3’ రిలీజ్ అని ప్రకటించేసింది.