సమగ్ర విశ్లేషణ : ఎవరు ఏమనుకున్నా టీడీపీ భవిష్యత్తు ఇలా మారబోతుంది..!

Wednesday, November 13th, 2019, 12:23:11 PM IST

ముమ్మాటికీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మహా వృక్షం లాంటి పార్టీ ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీయే అని చెప్పాలి.దాదాపు మూడున్నర దశాబ్దాల నుంచి ఉన్న ఒక ప్రాంతీయ పార్టీగా ఈ పార్టీకు గుర్తింపు ఉంది.అయితే అలాంటి పార్టీ భవిష్యత్తు ఇప్పుడు ఎలా మారబోతోంది?ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఎంతో కీలక పాత్ర పోషించిన ఈ పార్టీ ఎందుకు ఇంతలా దెబ్బ తినింది?తద్వారా కలిగిన చేటు నుంచి మళ్లీ కోలుకొని పునర్వైభవం తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయా లేదా అన్నది ఇప్పుడు సమగ్రంగా పరిశీలిద్దాం..

ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి మరియు వైసీపీ పార్టీ అధినేతగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తాను ఎన్నికల్లో మొట్టమొదటి సారి కొట్టిన విజయ ఢంకా తెలుగుదేశం పార్టీ అధిష్టానం చెవులు దద్దరిల్లేలా చేసింది.అయితే ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ ఇంత దారుణ పరాజయం పాలవ్వడాని కేవలం వైసీపీ మరియు జగన్ మాత్రమే సూత్రధారులు కాలేదు.జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ముఖ్య కారకులు అయ్యారు.ఈ విషయాన్ని కూడా ఎంతో మంది కీలక రాజకీయ అనలిస్టులు కూడా ఇదే చెప్తారు.

తెలుగుదేశం పార్టీ పట్ల ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖత తీసుకొచ్చింది మాత్రం జగన్ కన్నా పవన్ కళ్యాణే అని చెప్తారు.ఈ ఇద్దరి కారణం చేత తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఈసారి ఎన్నికలు ఒక పీడ కలగా మిగిలిపోతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఎప్పడైతే ఫలితాలు వచ్చి టీడీపీ కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యిందని తెలిసిందో తెలుగు తమ్ముళ్ల గుండెల్లో గుబులు మొదలయ్యింది.ఇంత తక్కువ సంఖ్య చూసేసరికి ఇక ఈ పార్టీలో ఉంటే వారి జీవితాలు ఎటు వైపు వెళ్తాయి అని అప్పటి వరకు ఉన్న తెలుగుదేశం పార్టీను వదిలేసి ఇతర పార్టీలలోకి వెళ్ళడానికి కూడా వారు ఎంతో సమయం తీసుకోలేదు.

“చేతిలో పవర్ ఉంటేనే విలువ అయినా పేరు అయినా” అని చెప్పడానికి ఈ చర్య ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.ఈసారి కానీ గెలిచినట్టైతే లోకేష్ ను ముఖ్యమంత్రి చేసేసి తాను విశ్రాంతి తీసుకుందామని చంద్ర బాబు అనుకున్నారు.కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అనుకున్నట్టు నామమాత్రంగా అయినా సీట్లు రాకుండా అయ్యిపోయింది టీడీపీ పరిస్థితి.అప్పటి దాకా టీడీపీకు ఆర్ధికంగా ఎంతో బలం అనుకున్న సుజనా లాంటి వారే ఆ ఆపార్టీని వీడడం,టీజీ వెంకటేష్ సీఎం రమేష్ లాంటి వారు కూడా బీజేపీలోకి వెళ్లిపోవడం పార్టీ మూలలను దెబ్బ తీశాయి.

దీనితో ఇప్పుడు తెలుగుదేశం అనే మహా వృక్షం బయటకు భారీగా కనిపిస్తూ లోలోపల క్షీణించిపోతుంది.దానికి తోడు మరో పక్క పార్టీ క్యాడర్ కూడా పక్క దారి పడుతూ రోజుకొక షాక్ ఇస్తూనే వస్తుంది.ఇక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావాల్సిందేనా?బాబు ఒక్కరే పార్టీను ఎంత కాలం లాక్కొస్తారు? పార్టీ పగ్గాలు లోకేష్ కు ఇస్తే ఎంతవరకు సమర్ధవంతగా నడిపించగలడు ఇక ఏపీ రాజకీయ వర్గాల్లో “పసుపు జెండా” , “సైకిల్” గుర్తులు కనుమరుగు అయ్యిపోవాల్సిందేనా అన్న అనేక ప్రశ్నలు క్షేత్ర స్థాయిలో పార్టీ వర్గాలను తినేస్తున్నాయి.

అయితే వచ్చే ఎన్నికల్లో మరోసారి టీడీపీకు ఇదే గతి పడుతుందా?లేక మళ్ళీ పుంజుకునేందుకు అవకాశాలు లేవా అంటే ఉన్నాయి.ఒక పక్కా ప్రణాళిక ప్రకారం బాబు మళ్ళీ తన బుర్రకు పదును పెట్టినట్టయితే పూర్వ వైభవం తీసుకురావచ్చు.ఎందుకంటే అంతా టీడీపీకు కేవలం 23 స్థానాలే వచ్చాయని అసెంబ్లీ సంఖ్యా బలం చూపిస్తున్నారు కానీ ఎంత శాతం ఓటింగ్ వచ్చింది అని ఆలోచించట్లేదు.జనసేన వల్ల టీడీపీ దెబ్బ తినింది అన్న మాట వాస్తవం అయినా సరే ప్రధాన పోటీ మాత్రం వైసీపీ మరియు టీడీపీల మధ్యనే జరిగాయి.

వైసీపీకు టీడీపీకు కేవలం 30 లక్షలకు మించిన ఓట్లు మార్జిన్ మాత్రమే ఉంది.అంటే టీడీపీకు బలం క్షేత్ర స్థాయిలో గట్టిగా ఉంది సో ముమ్మాటికీ అవకాశం ఉంది.ఎలాగో బలం ఉంది కాబట్టి స్థానికంగా పార్టీను వీడకుండా విధేయతగా ఉన్న నాయకులను కాని గుర్తించి సరైన ప్రణాళిక వేసినట్లయితే భవిష్యత్తులో తప్పకుండా టీడీపీకు పునర్వైభవం వస్తుంది.అలా కాదని ఏమాత్రం తప్పటడుగులు వేసినా సరే ఇతర పార్టీలు అనుకుట్టుగా భూస్థాపితం అయ్యిపోవడం ఖాయం.మరి 40 ఏళ్ల అనుభవంతో చంద్రబాబు పార్టీను ఏం చేస్తారో చూడాలి.