యాడ్ ఎఫెక్ట్ : మెగా హీరోయిన్ మారింది ?

Tuesday, April 10th, 2018, 10:16:17 AM IST

కెరీర్ మొదటి నుండి భిన్నమైన సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే తొలిప్రేమ సినిమాతో మంచి విజయం అందుకున్న అయన తాజాగా ఘాజి ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ స్పేస్ సయింటిఫిక్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం హైద్రాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని .. అందులో ఇప్పటికే అతిథిరావు హైదరిని ఎంపిక చేయగా .. మరో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠీని ఎంపిక చేసారు. నిజానికి లావణ్య ప్లేస్ లో ముంబై మోడల్ కావ్య థాపర్ ని ఎంపిక చేసారు .. కావ్య థాపర్ పలు కమర్షియల్ యాడ్స్ తో బాగా పాపులర్ అందుకే తీసుకున్నారు .. తాజాగా ఈ అమ్మడు ఓ కండోమ్ యాడ్ లో హాట్ హాట్ గా నటించడం సంచలనం గా మారింది. దాంతో కావ్య థాపర్ ని కావాలనే పక్కకు పెట్టారని ఆమె ప్లేస్ లో లావణ్య ను తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి హీరోయిన్ మార్చడం వెనక కండోమ్ యాడ్ ఎఫెక్ట్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి?