సోష‌ల్ మీడియాలో వైర‌ల్ : గొరిల్లాల‌తో సెల్ఫీ .. మీరూ ఓ లుక్కేయండి..!

Monday, April 22nd, 2019, 04:37:06 PM IST

మానవులకి ఒకరిపై ఒకరికి ఎంత విశ్వాసం ఉంటుందో, లేదో తెలిదు కానీ నోరు లేని మూగ జీవాలకు మాత్రం విశ్వాసం బాగానే ఉంటుంది. అయితే ఒక కాంగోస్ పార్క్ రేంజర్ రెండు గోరిల్లాలతో సెల్ఫీ తీసుకున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

యూనెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌ను రక్షించటానికి దాదాపు 600 మంది రేంజర్స్ విధులు నిర్వహిస్తుంటారు. అయితే అందులో మ్యాథ్యు శ్యామవు అనే ఒక రేంజర్ గొరిల్లాలతో సెల్ఫీ తీసుకుని ఆ ఫోటోలను ఎలైట్ యాంటీ పోచింగ్ యూనిట్స్ అండ్ కాంబట్ ట్రాకర్స్ ఫేస్‌బుక్‌లో అప్లోడ్ చేశారు. అయితే ఆ పార్క్‌లో మొత్తం ఎనిమిది గొరిల్లా కుటుంబాలు, నాలుగు ఒంటరి మగ గొరిల్లాలు ఉన్నయని మేనేజర్ ఆండ్రే బామ వెల్లడించారు. అయితే ఆ గొరిల్లాలు

వాటి సంరక్షణను ఎప్పటికప్పుడు చూసుకునే ఇక్కడి రేంజర్లతో చాలా ప్రేమానుభవ సంబంధాలను కలిగి ఉంటాయని ఆయన అన్నారు. ఏది ఏమైనా రేంజర్ మ్యాథ్యు శ్యామవు తీసుకున్న ఈ సెల్ఫీ కి 19 వేలకు పైగా షేర్లు వచ్చాయంటే నెటిజన్లకు, జంతు ప్రేమికులకు ఎంత బాగా నచ్చిందో ఇట్టే అర్ధమైపోతుంది.