31 సీట్లతో మేయర్ ని దక్కించుకుందాం అని చూస్తున్న కాంగ్రెస్

Sunday, February 26th, 2017, 11:37:59 AM IST


ముంబై నగర్ పాలక ఎన్నికల్లో సరైన మెజారిటీ రాకపోవడం తో మేయర్ పీఠం కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు దాదాపు 227 సభ్యులు ఉన్న ఈ ముంబై కార్పరేషన్ లో శివసేన కి 84 , బీజేపీ 82 , కాంగ్రెస్ కి 31 సీట్ లు లభించిన సంగతి చూసాం. గెలిచిన ఇండిపెండెంట్లలో ఇప్పటికే నలుగురు శివసేనకు మద్దతిచ్చారు. దీంతో ఆ పార్టీ బలం 88కి పెరిగినప్పటికీ, మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేంత మెజారిటీ లేదు. ఇదే సమయంలో శివసేనకు మద్దతిచ్చేందుకు బీజేపీ, బీజేపీ అభ్యర్థికి జై కొట్టేందుకు శివసేన సుముఖంగా లేకపోవడంతో, మిగతా చిన్న పార్టీలతో కలసి మేయర్ పీఠానికి నామినేషనల్ వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ముంబై చీఫ్ సంజయ్ నిరుపమ్ తెలిపారు. తమకు గెలిచే అవకాశాలు లేవన్న సంగతి తెలుసని, ఇదే సమయంలో ఇతర పార్టీలకు ఆ అవకాశాన్ని అంత సులువుగా మాత్రం దక్కనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. శివసేనకు తాము మద్దతివ్వబోమని వెల్లడించిన ఆయన, బీజేపీతో ఆ పార్టీ అనైతిక బంధాన్ని కలుపుకుని మేయర్ పీఠాన్ని పంచుకోవాలని భావిస్తోందని ఆరోపించారు.