యురేనియం ఎఫెక్ట్: కాంగ్రెస్ ఆ విషయంలో తప్పు చేసిందా..!

Wednesday, September 18th, 2019, 01:44:33 AM IST

నల్లమల్లలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నిన్న జనసేన ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యి యురేనియం తవ్వకాలను ఆపే వరకు మనమందరం కలిసి పోరాడాలని తీర్మానించుకున్నారు.

అయితే ఈ యురేనియం ఎఫెక్ట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద చిచ్చు రేపింది. నిన్న జనసేన ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశానికి జాతీయ పార్టీ వెళ్లి జనసేన జెండా కింద కూర్చొవడం సరికాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు సంపత్ కుమార్ సొంత పార్టీ నేతలపై ఫైర్ అయ్యారు. యురేనియం అంశాన్ని తెర మీదకు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పిలిచినప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడా అంటూ నిలదీస్తూ సీనియర్ నేతలంతా వెళ్లి పవన్ దగ్గర కూర్చోవడం సిగ్గుచేటు అని అన్నారు. అయితే దీనిపై స్పందించిన కుంతియా కూడా అఖిలపక్ష సమావేశానికి వెళ్ళడం తప్పేనని అన్నారు. అయితే ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.