సచివాలయాన్ని కరోనా ఆసుపత్రిగా మార్చండి.. కాంగ్రెస్ నేత డిమాండ్..!

Friday, July 3rd, 2020, 12:51:02 AM IST


తెలంగాణ సచివాలయ భవనాన్ని కూల్చేందుకు హైకోర్ట్ అనుమతులు ఇవ్వడంతో తెలంగాణలో సచివాలయాన్ని కూల్చొద్దని, ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని కోవిడ్ ఆస్పత్రిగా మారిస్తే ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.

అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ మూర్ఖంగా ప్రవర్తించొద్దని సూచించారు. సెక్రటేరియట్ అందరికీ అందుబాటులో ఉంటుందని, పేదలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. సచివాలయం కూల్చివేత ప్రజా వ్యతిరేకమని, 10 వేల పడకల ఆస్పత్రిగా చేయొచ్చు. పేదలకు అండగా నిలవచ్చని అని అనిల్ కుమార్ సూచించారు.