కళ్యాణ్ రామ్ హీరోయిన్ కాంగ్రెస్ పార్టీ వీడనుందా..!

Sunday, June 2nd, 2019, 12:53:54 PM IST

జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి దివ్య స్పందన తాజాగా మరోసారి వార్తల్లోకెక్కారు. మొదటి మహిళా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌కు తన ట్విట్టర్ ద్వారా శుభాకంక్షలు తెలిపింది దివ్య స్పందన. అయితే కాంగ్రెస్ పార్టీలో 1970లో ఆర్థిక శాఖకి ఇంఛార్జ్‌గా ఇందిరా గాంధీ ఉన్నారని ఇప్పుడు మొట్తమొదటి సారిగా కేంద్ర ఆర్థికశాఖ వంటి కీలక బాధ్యతలను చేపడుతున్న బీజేపీ నాయకురాలు నిర్మలా సీతారామన్‌కు అభినందనలు తెలుపుతూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది. అయితే రెండు రోజుల తరువాత ఆమె ప్రోపైల్ పేజ్ పనిచేయడంలేదు అని చూపిస్తుంది.

అయితే రెండు రోజుల క్రితం పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపుతుంది. అయితే ఒక నెలపాటు మీడియాకు, టీవీ డిబేట్లకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ తీర్మానించుకుంది. అయితే ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఇది పెద్ద చర్చగా మారిపోయింది. అయితే 2013 లో ఈమె మాండ్యా నుంచి కాంగ్రెస్ తరుపున ఎంపీగా కూడా గెలిచారు దివ్య స్పందన . మళ్ళీ 2014లో జరిగిన ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈమె రాజకీయంగానే కాకుండా కన్నడ, తమిల్, తెలుగు సినిమాలలో నటిస్తూ ఉంటుంది. అయితే ఈమె కళ్యాణ్ రామ్ సరసన అభిమన్యు అనే తెలుగు సినిమాలో కూడా నటించారు. అయితే ఈమె ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వ్యవహారాల ఇంఛార్జ్‌గా పనిచేస్తున్నారు. అయితే రెండు రోజుల క్రితం పెట్టిన పోస్ట్ కనిపించకపోవడం, ఈమె ప్రొఫైల్ మొత్తానికే పనిచేయకపోవడం చూస్తుంటే ఏమి జరిగి ఉంటుందని అందరిలో ఇప్పుడు ఇదొక చర్చానీయాంశంగా మారింది. అయితే ఇలాంటి తరుణంలో దివ్య స్పందన పార్టీ వీడనుందా అనే అనుమానాలు అందరికి తలెత్తాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో బాగా ప్రచారం అవుతుండడంతో దివ్య స్పందన మాత్రం అవన్నీ పుకార్లేనని జాతీయ కాంగ్రెస్ పార్టీనీ వీడే అవకాశమే లేదని చెప్పుకొచ్చింది.