దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలిచినప్పటి నుంచి ఆ పార్టీ ఫుల్ జోష్‌లో కనిపిస్తుంది. అప్పటి నుంచి ఆ పార్టీలోకి వలసలు కూడా భారీగా పెరుగుతున్నాయి. వివిధ పార్టీల్లోని సీనియర్లు, ద్వితీయ శ్రేణి నేతలను తమ పార్టీలో చేర్చుకుంటూ పార్టీనీ మరింత బలోపేతం చేసేందుకు బీజేపీ వ్యూహాలు సిద్దం చేసుకుంది. అయితే ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు, టీఆర్ఎస్ నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు.
అయితే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీనీ వీడి బీజేపీలో చేరేందుకు సిద్దమైనట్టు సమాచారం. ప్రస్తుతం కేరళలో ఉన్న జానారెడ్డితో బీజేపీ ఇప్పటికే టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. బీజేపీ ఇచ్చిన ఆఫర్‌కు జానారెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నెల 7 న ఢిల్లీలో బీజేపీ అగ్రనేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఆయన బీజేపీ నుంచి బరిలోకి దిగనున్నట్లు తెలిసింది.