ఇలాగే కొనసాగితే చరిత్రలో పిచ్చిరెడ్డి గా మిగిలిపోవడం ఖాయం!

Monday, January 13th, 2020, 09:13:00 PM IST

ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు కావాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదన ఫై కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి తులసి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. అమరావతి ప్రజల ఆందోళనలకి మద్దతు తెలిపారు. ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు రాజధానిగా అమరావతిని అంగీకరించి, ముప్పై వేల ఎకరాల భూమి కావాలని అన్న వ్యాఖ్యలని మరొకసారి గుర్తు చేసారు. మాట తప్పం, మడమ తిప్పం అంటూనే పరిపాలన మొదట్లోనే మాట తప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. పరిపాలన చేతకాక తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఘాటైన విమర్శలు చేసారు. ఇలాగే కొనసాగితే చరిత్రలో పిచ్చి రెడ్డి గా మిగిలిపోవడం ఖాయమని అన్నారు.

రాజధాని ప్రాంతంలో వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్న తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంత ప్రజలకోసం రాజీనామా చేయాలనీ అన్నారు. వారికీ అండగా నిలబడలన్నారు. తిరిగి ప్రజలే భారీ మెజారిటీ తో ఎన్నుకుంటారని, లేకుంటే చరిత్ర హీనులుగా చరిత్రలో మిగిలిపోవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కోసం పోరాడాలని అన్నారు. అయితే మంగళగిరి ఎమ్మెల్యే మూడు రాజధానులు కావాలంటూ చేసిన ర్యాలీ ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇతర ప్రాంత ప్రజలను తీసుకొచ్చి ర్యాలీ నిర్వహించడం సిగ్గుచేటని అన్నారు. సిగ్గుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, అపుడు తిరిగి మూడు రాజధానులు కావాలనే డిమాండ్ తో తిరిగి పోటీ చేయమని అన్నారు. తులసి రెడ్డి చేసిన వ్యాఖ్యల ఫై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.