ఇదంతా కూడా సీఎం కేసీఆర్ మైండ్ గేమ్ – కాంగ్రెస్ నేత

Tuesday, November 12th, 2019, 01:00:45 AM IST

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దీ రోజులుగా జరుగుతున్నటువంటి ఆర్టీసీ కార్మికుల సమ్మె కి రాష్ట్రంలోని విపక్షాలు అన్ని కూడా మద్దతు ఇస్తున్నారు. కానీ ఈ విషయంలో సీఎం కేసీఆర్ మాత్రం చాలా కర్కశంగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్‌ తీవ్రమైన విమర్శలు చేశారు. అంతేకాకుండా ఒకవైపు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు అన్ని కూడా రోడ్డున పడుతుంటే, సీఎం కేసీఆర్ కి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని కాంగ్రెస్ నేత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతానికి రాష్ట్రంలో ఆర్టీసీ విషయంలో న్యాయస్థానం కాస్త మద్దతుగా వ్యవహరిస్తుందని సీనియర్ కాంగ్రెస్ నేత హనుమంతరావు మీడియా ముఖంగా చెప్పారు.

ఇకపోతే ఇటీవల రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులు ట్యాంక్ బండ్ పై చేపట్టినటువంటి ర్యాలీ విషయంలో పోలీసులు చాలా అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని, దీనికి అంతటికి కారణం సీఎం కేసీఆర్ అని ఆరోపించారు. ఇకపోతే ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ పేరుతో సీఎం కేసీఆర్‌ మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని, వారందరిని కూడా తన మాయ మాటలతో మభ్య పెడుతున్నారని వీహెచ్‌ ఆరోపించారు. ఇకపోతే రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులందరికీ కూడా విపక్షాల మద్దతు ఎప్పటికి ఉంటుందని కాంగ్రెస్ నేత హనుమంతరావు స్పష్టం చేశారు.