బ్రేకింగ్: యురేనియం ఉద్యమ క్రెడిట్ జనసేనకు ఇవ్వొద్దు

Friday, September 20th, 2019, 06:26:26 PM IST

కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ శుక్రవారం మీడియా సమావేశం లో పలు సంచలనాలకు తేర తీశారు. కాంగ్రెస్ మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పై ఘాటుగానే సెటైర్ లు వేశారు. రేవంత్ రెడ్డి సంపత్ పై ఇటీవలే పలు వ్యాఖ్యలు చేసారు. యురేనియం తవ్వకాల విషయం లో సంపత్ కి ఏబీసీడీ లు కూడా తెలీదని అన్నారు. దానికి కౌంటర్ గా తాను చదువులో పి.హెచ్ డి చేసానని, అది ప్రజలందరికి తెలుసు అని జవాబిచ్చారు. గత రెండు రోజుల నుండి ఢిల్లీ లో ఉండుట వలన మీడియా కి అందుబాటులో లేయారని అన్నారు. రేవంత్ యురేనియం విషయం లో ఎందుకు అలా అన్నారో అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడుతా అన్నారు.

అఖిల పక్ష సమావేశానికి రేవంత్ కి ఆహ్వానం అందలేదని సంపత్ తెలియ జేశారు. యురేనియం ఉద్యమ విషయం పట్ల కూడా కొంత కోపం వ్యక్త పరిచారు. ఉద్యమ క్రెడిట్ అంత జనసేన కి వెళ్లడం పట్ల మండిపడ్డారు. కాంగ్రెస్ పోరాటం ఎప్పటినుండో అని, జనసేన బ్యానర్ పై జరిగిన అఖిల పక్ష కార్యక్రమం క్రెడిట్ ఒక్క జనసేన కే ఇవ్వడం కరెక్ట్ కాదని అభిప్రాయం పడతారు. అఖిలపక్షానికి వెళ్లాల్సి వస్తే ముందుగా కాంగ్రెస్ పాత్రా పట్ల చర్చలు జరిపాక వెళ్ళాలి అన్నట్లు సమాధానమిచ్చారు.