తెరాసను నిమర్జనం చేస్తాం..!

Monday, September 8th, 2014, 04:34:22 PM IST


మెదక్ పార్లమెంట్ స్థానానికి మరికొద్ది రోజులలో ఉపఎన్నిక జరగబోతున్నది. ఉప ఎన్నిక తేదీ దగ్గర పడుతున్న కొద్ది పార్టీల మధ్య మాటల వాడి పెరిదింగి. టీఆర్ఎస్ పార్టీని ఈ ఉపఎన్నికలో చిత్తుగా ఓడిస్తామని తెలంగాణ కాంగ్రెస్ నేత, మెదక్ పార్లమెంట్ అభ్యర్ధి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ నియోజక వర్గ ప్రజలలో తెరాసపై వ్యతిరేకత వచ్చిందని.. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్..ఇప్పుడు ప్రజలను మోసం చేసిందని.. రేపు జరగబోయే ఉపఎన్నికలలో ప్రజలు తెరాసను నిమర్జనం చేస్తారని ఆమె అన్నారు. తెరాసకు ఓటమి భయం పట్టుకున్నదని.. అందుకే నర్సాపూర్ లో భారీ సభను ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నదని… తెరాస ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ పార్టీకి ఓటమి తప్పదని సునీతా లక్ష్మారెడ్డి జోస్యం చెప్పారు.