రేవంత్ రెడ్డి దూకుడు తగ్గించుకో..వీహెచ్ హెచ్చరిక

Friday, September 20th, 2019, 04:37:26 PM IST

కాంగ్రెస్ లో పార్టీలో గత కొన్నేళ్లుగా నడుస్తున్న వర్గ పోరు ఈ మధ్య వీధికెక్కి రచ్చ రచ్చ అవుతుంది. రేవంత్ రెడ్డి వర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం అంటూ రెండుగా చీలిపోయి ఒకరి మీద మరొకరు విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి చెక్ పెట్టటానికి కాంగ్రెస్ లోని సీనియర్ నేతలు అందరు ఏకమైయ్యారు. గతంలో వాళ్ళు వాళ్ళు ఎన్నో తిట్టుకున్నా కానీ నేడు రేవంత్ రెడ్డిని ఎదగనివ్వకుండా ఉండటానికి విభేదాలు పక్కన పెట్టిమరీ ఏకం కావటం విశేషం.

తాజాగా రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహెచ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చాలా జూనియర్‌, స్పీడ్‌ ఎక్కువుంది, తగ్గించుకోవాలని ఆయన సూచించారు. రేవంత్‌రెడ్డి స్టయిల్‌ ప్రాంతీయ పార్టీల్లో నడుస్తుంది కానీ, కాంగ్రెస్‌లో నడవదన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజార్ నగర్ లో మూడుసార్లు గెలిచాడు. ఆయనికి ఆ ప్రాంతంలో మంచి పట్టు ఉంది. అందుకే ఆయన సతీమణిని అక్కడ పోటీకి నిలబెట్టాడు దానిని రేవంత్ తప్పు పట్టటం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చాడు.