వైసీపీ నేత కేవీపీపై కాంగ్రెస్ నేత వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Sunday, May 24th, 2020, 01:19:49 AM IST

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు ఏపీ వైసీపీ నేతపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేడు కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలో పాల్గొన్న వీహెచ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే కేవీపీ తెలంగాణ ఎంపీనని చెబుతున్నారని, ఈ నేపథ్యంలో ఆయనను కూడా పోతిరెడ్డిపాడు వ్యతిరేక ఆందోళనకు ఆహ్వానించాలని సూచించారు. అంతేకాదు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను సమావేశానికి ఎందుకు పిలవలేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌‌ కుమార్ రెడ్డీని ప్రశ్నించగా దీనిపై స్పందించిన పొన్నం పొన్నాలకు సమాచారం ఇచ్చినా రాలేదని అన్నారు.