జో అచ్యుతానంద బజ్జో ‘గోవిందా’

Friday, September 5th, 2014, 12:45:11 PM IST


రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తాం.. మెదక్ ఉపఎన్నికలలో గెలిచి తీరతాం.. ఇవి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధికి తెలంగాణ నేతలు ఇచ్చిన హామీ.. కాని ఎం చేశారు తెలుసా..!
మెదక్ ఉపఎన్నికల సందర్భంగా మెదక్ జిల్లా పటాన్ చెరువులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ నేతలు పోటీ పడీ మరీ కునుకుతీశారు.

అధికారం, చేతినిండా పని లేకపోతే ఎవరైనా ఏంచేస్తారు కునుకుతీయక.. కాని, మెదక్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలాగైనా పార్టీ అభ్యర్ధిని గెలిపించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సోనియా గాంధి ఆదేశించింది. అధినేత్రి ఆదేశాలను శిరసావహిస్తామని మాటిచ్చిన నేతలు.. ఇప్పుడు ఇలా కునుకు తెస్తే ఎలా అని కార్యకర్తలు వాపోతున్నారు..