యురేనియం విషయం లో “తెరాస ప్రభుత్వం” ప్రజల్ని మోసం చేస్తుందా?

Tuesday, September 17th, 2019, 11:59:29 AM IST

నల్లమల లో యురేనియం తవ్వకాల పై ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందంటూ కాంగ్రెస్ నేతలు సంపత్ కుమార్, వంశీ చంద్ రెడ్డి ఆరోపించారు. కెసిఆర్, కేటీఆర్ యురేనియం విషయం లో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్, కేటీఆర్ ఇద్దరు పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. యురేనియం తవ్వకాలపై తీవ్ర స్థాయిలో తెరాస ప్రభుత్వం పై మండి పడ్డారు.

మీడియా తో మాట్లాడిన కాంగ్రెస్ నేతలు కెసిఆర్ తీరుపై తీవ్ర విమర్శలు చేసారు. కెసిఆర్ ప్రకృతి ప్రేమికుడనేది నిజమైతే , స్టేట్ బోర్డు అఫ్ వైల్డ్ లైఫ్ సమావేశానికి ఎందుకు హాజరు కాలేదు అంటూ విమర్శించారు. నల్లమల ఉద్యమం ఆగదని తెలియజేసారు. తవ్వకాలు మొత్తం రద్దు చేసేదాకా తమ పోరాటాన్ని విరమించేది లేదని అన్నారు. యురేనియం అన్వేషణకు కూడా అనుమతిని ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేసారు.