టీఆర్ఎస్ అవినీతికి బీజేపీ రక్షణగా నిలుస్తుంది.. జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

Tuesday, June 8th, 2021, 08:12:12 PM IST

టీఆర్ఎస్ అవినీతికి బీజేపీ రక్షణగా నిలుస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి ఈటల బీజేపీలో చేరుతారని అసలు తాను ఊహించలేదని, బీజేపీలో చేరడం వల్ల ఆయన బలహీనపడి కేవలం తన నియోజక వర్గానికి మాత్రమే పరిమితం అయ్యాడని అన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఈటల పోటీ చేస్తే వేరే విధంగా ఉండేదని, బీజేపీలో చేరతానని ప్రకటించి తన వ్యక్తిత్వాన్ని తానే తగ్గించుకున్నారని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

ఇదిలా ఉంటే అవినీతి చేసిన టీఆర్ఎస్ నేతలను ఎప్పుడు జైల్లో పెడతారో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమాధానం చెప్పాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీల డబ్బులు 2 నెలల నుంచి చెల్లించడం లేదని, ప్రభుత్వం తొలగించిన ఉపాధి హామీ పథకంలోని ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.