టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి తనకు రూ.50 కోట్ల ఆఫర్ వచ్చిందని భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పోడెం వీరయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. పినపాక నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే పోడెం వీరయ్య తాను మొదటినుంచి కాంగ్రెస్ వాదినేనని, నాకు టీఆర్ఎస్ నుంచి రూ 50 కోట్ల ఆఫర్ వచ్చినప్పటికి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నమ్మి పార్టీనీ వీడలేదని అలాంటి నాపై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు.
అయితే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పు అక్కిరెడ్డి సంజీవరెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నారని అందుకే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు తరుపున సంజీవ రెడ్డి ప్రచారం చేశాడని ఆరోపించారు. అయితే తాను భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పినపాక నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించానని, జిల్లాలో ఎక్కడా గ్రూపు రాజకీయాలు చేస్తే సహించేదిలేదని ఎమ్మెల్యే పోడెం వీరయ్య చెప్పుకొచ్చారు.