టీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పెద్దపల్లొ జిల్లాలో నేడు మీడియా సమావేశంలో మాట్లాడిన జీవన్ రెడ్డి గ్రామాలకు వచ్చే టీఆర్ఎస్ నేతలను తరిమికొట్టాలని ప్రజలకు సూచించారు. మంథని, రామగుండం ప్రాంతంలో ప్రాజెక్టులు నిర్మించి ఇక్కడి నీళ్లు ఇతర ప్రాంతాలకు తరలించుకుపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాదు అసలు రైతుల సమస్యలను పట్టించుకోకుండా టీఆర్ఎస్ నేతలు ఇసుక దోచుకుంటూ కోట్లు దండుకుంటున్నారని అన్నారు. సీఎం పదవి తనకు చెప్పుతో సమానమన్న కేసీఆర్కు అంత అహంకారం పనికి రాదని, సీఎం హోదాలో ఉండి మహిళలను కుక్కలు అని మాట్లాడడం సరికాదని జీవన్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు ఇష్టారీతిగా కాంగ్రెస్ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని, ఇకపై మీ డ్రామాలను సాగనీవమని హెచ్చరించారు.