తప్పుడు మాటలొద్దు!

Tuesday, October 14th, 2014, 12:49:31 PM IST

Congress-MP-Gutta-sukhendar
కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం నల్గొండలో తెరాస ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేలు, దరఖాస్తులు అంటూ తెరాస ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందంటూ మండిపడ్డారు. అలాగే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పెట్టిన సంక్షేమ పధకాలను ప్రజలకు దూరం చేస్తే సహించేది లేదని గుత్తా హెచ్చరించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదం వల్లే విద్యుత్ సమస్య అంటూ తెరాస నేతలు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని, వారంతా లెక్కలు తీసి చూసుకోవాలని సూచించారు. ఇక తన విమర్శలను తెలంగాణ టిడిపి నేతలపైకి సంధిస్తూ తెలుగుదేశం నాయకులు బస్సు యాత్రలు చెయ్యడం కాదని చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును అడిగి ఏపీ నుండి విద్యుత్ ను తెప్పించాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సవాల్ విసిరారు.