సీఎం కేసీఆర్‌కి ఇదే నా శాపం.. కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి..!

Monday, July 6th, 2020, 10:19:40 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కరోనాను కంట్రోల్ చెయ్యడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమయ్యిందని కోమటిరెడ్డి మండిపడ్డారు.

అయితే ఏపీలో 10 లక్షలకు పైగా కరోనా టెస్టులు నిర్వహిస్తే, తెలంగాణలో లక్ష మాత్రమే నిర్వహించారని అన్నారు. ఏపీ, ఢిల్లో సీఎంలను చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. ప్రగతిభవన్‌లో నలుగురికి కరోనా వచ్చినందుకు, సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌కి వెళ్ళి దాక్కున్నారని, ప్రజలకి ధైర్యం చెప్పాల్సిన సమయంలో ఫామ్ హౌస్‌కి వెళ్ళి కూర్చోవడం సరికాదని అన్నారు. ఫామ్‌హౌస్‌లో ఉన్నంత మాత్రానా కరోనా రాదా, అక్కడకు కూడా కరోనా వస్తుంది ఇది నా శాపం అని అన్నారు.