కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్..!

Tuesday, June 11th, 2019, 09:47:51 AM IST

తెలంగాణలో మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ తరుపున మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి విజయం సాధించిన ఎంపీ రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. ఈ సారి ప్రజలకు మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న కేసీఆర్‌కు 2023 ఎన్నికలలో ఓటమి తప్పదని హెచ్చరించారు.

తెలంగాణలో మరోసారి అధికారంలోకి వస్తే అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను డబ్బు పెట్టి కొంటుండే తప్పా, తెలంగాణ ప్రజానీకానికి మాత్రం ఏమీ చేయడంలేదన్నారు. అయితే ప్రజాతీర్పును కాదని, ప్రభుత్వాన్ని ఎదురించడానికి ప్రతిపక్షమనేదే లేకుండా చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని ఇది నిజంగా ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని అన్నారు. వచ్చే 2023 ఎన్నికలలో మాత్రం ప్రజలు కేసీఆర్‌కు సరైన బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. ఇంత మంది ఎమ్మెల్యేలను కొన్నా కేసీఆర్‌కు మిగిలేది డర్టీ డజన్‌ ఎమ్మెల్యేలేనని జోస్యం చెప్పారు.